జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » ఢాకాలో లష్కర్ తోయిబా కీలక మిలిటెంట్ అరెస్టు! (LeT | Dhaka | US | Security forces | Militant | Bangladesh | India)
Feedback Print Bookmark and Share
 
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో లష్కర్ తోయిబా తీవ్రవాద సంస్థకు చెందిన కీలక మిలిటెంట్‌ను ఆ దేశ పోలీసులు సోమవారం ఉదయం అరెస్టు చేశాయి. ఢాకాలోని భారత హైకమిషన్, యూఎస్ ఎంబసీలపై దాడి చేసేందుకు పన్నిన కుట్రలో కీలక సూత్రధారి అని ఢాకా అధికారులు వెల్లడించారు.

బంగ్లాదేశ్‌లో లష్కర్ తోయిబా కార్యకలాపాలు సాగిస్తున్న మొహ్మద్ మోతలెమ్ అలియాస్ మంజును రాజధానిలో మోతీజీల్ అనే ప్రాంతంలో అరెస్టు చేసినట్టు వారు వెల్లడించారు. వారం రోజుల క్రితం అరెస్టు అయిన ముగ్గురు పాక్‌కు చెందిన లష్కర్ నేతలు ఇచ్చిన సమాచారం మేరకు మంజును అరెస్టు చేశారు.

దీనిపై డిటెక్టివ్ బ్రాంచ్ డిప్యూటీ పోలీసు కమిషనర్ మునిరల్ ఇస్లామ్ మాట్లాడుతూ.. తాము అరెస్టు చేసిన ముగ్గురు లష్కర్ తోయిబా తీవ్రవాదులు ఇచ్చిన సమాచారం మేరకు మంజును అరెస్టు చేసినట్టు చెప్పారు. ఢాకాలోని భారత హైకమిషన్, యూఎస్ ఎంబసీలపై దాడి చేసేందుకు పన్నిన వ్యూహానికి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.