ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » 26/11 సూత్రధారులపై పాక్ చర్యలు పూజ్యం: పీఎం (Manmohan | PM | Terrorist | America | Pak | Nuclear weapons)
ముంబై దాడుల సూత్రధారులపై పాకిస్థాన్ చేపట్టిన చర్యలు పూజ్యమని ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఈ దాడులు జరిగి ఏడాది కావస్తున్నా, వీటికి సంబంధించి పలు ఆధారాలు సమర్పించినా పాక్ వైపు నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదన్నారు. ముంబై దాడులకు సూత్రధారులైన సయీద్, మాలిక్‌లు ఆ దేశ గడ్డపై స్వేచ్ఛగా విహరిస్తున్నారని ప్రధాని అన్నారు.
నాలుగు రోజుల పర్యటన నిమిత్తం ఆయన వాషింగ్టన్‌కు చేరుకున్నారు. అంతకుముందు ఆయన ఒక న్యూస్ ఛానల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాకిస్థాన్‌లో ఎవరి పెత్తనం సాగుతుందో.. ఎవరికి అధికారం ఉందో తెలియడం లేదన్నారు.
సాధారణంగా పాక్‌లో ఆదేశ ఆర్మీదే పైచేయిగా ఉంటుందన్నారు. అయితే, ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉన్న సమయంలో కూడా ఆర్మీ పట్టు సాధించడం ఆ దేశానికి మంచిది కాదన్నారు. అలాగే, పాక్ చేతిలో ఉన్న అణ్వాయుధాల సురక్షితంపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆ ఆయుధాలు క్షేమంగానే ఉన్నట్టు అమెరికా హామీ ఇచ్చిందని, దీనిపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. తన అమెరికా పర్యటనలో తీవ్రవాదం, అణు ఒప్పందం, ద్వైపాక్షిక సంబంధాల పటిష్టం తదితర అంశాలు కీలకం కానున్నట్టు ఆయన మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.