ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » నేడు బరాక్ ఒబామాతో ప్రధాని మన్మోహన్ భేటీ! (Manmohan | Obama | America | White House | N-Deal | Terrorism)
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మన్మోహన్ సింగ్ మంగళవారం అగ్రదేశం అధినేత బరాక్ ఒబామాతో భేటీ కానున్నారు. ఈ ఇరువురి నేతల సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాల మెరుగు, అణు విద్యుత్, ఉగ్రవాద నిర్మూలన సహా పలు అంశాలపై చర్చించనున్నారు. ఈ కీలక సమావేశం అనంతరం ఒబామా, మన్మోహన్ సింగ్‌లు కలిసి ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేయనున్నారు.
ఆ తర్వాత రాత్రికి ప్రధాని దంపతులకు శ్వేతసౌధంలో ఒబామా దంపతులు విందు ఇస్తుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ విందులో భారత చలన చిత్ర పరిశ్రమ తరపున ఐశ్వర్యారాయ్ దంపతులతో పాటు.. భారత కుబేరుడు అనిల్ అంబానీ, పశ్చమబెంగాల్ రాష్ట్ర గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ, ప్రముఖ రచయిత్రి అరుంధతీరాయ్‌లు భారత్ తరపున పాల్గొంటున్నారు.
ఇదిలావుండగా, భారత్-అమెరికా దేశాల మధ్య కుదిరిన పౌర అణు ఒప్పందానికి తుదిరూపం ఇచ్చేందుకు ఇరు దేశాల అణుసంస్థల నిపుణులు సుదీర్ఘంగా చర్చించి ఒక నివేదకను తయారు చేశారు. దీనిపై ఒబామా, మన్మోహన్ సింగ్‌లు చర్చించి మార్పులు చేర్పులు చేస్తారు. ఆ తర్వాత దీనిపై ఇద్దరు నేతలు కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేస్తారు.