చైనాలో పాల పౌడర్ కుంభకోణం కేసులో ఇద్దరు దోషులకు మరణ శిక్ష విధిస్తూ స్థానిక కోర్టు తీర్పు ఇచ్చింది. జాంగ్ యుజున్, జెంగ్ జిన్‌పింగ్ అనే ఇద్దరికి ఉరిశిక్ష విధిస్తూ షిజిఝువాంగ్ మునిసిపల్ ఇంటర్మీడియేట్ పీపుల్స్ కోర్టు మంగళవారం తీర్పు ఇచ్చినట్టు చైనా అధికారిక వార్తా సంస్థ జినువా న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.
గత కొన్ని సంవత్సరాలకు ముందు.. చైనాలో పాల పౌడర్ కుంభకోణం చోటు చేసుకుంది. పసికందులకు ఇచ్చే పాల పౌడర్‌లో ఇతర విషపూరిత మిశ్రమ పౌడర్లును కలిపి విక్రయించారు. దీనివల్ల మూడు లక్షల మంది చిన్నారులు అనారోగ్యం పాలుకాగా, ఆరుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు.
ఈ కేసు విచారణలో మంగళవారం తుది తీర్పు వెలువడింది. ఈ కేసులో ప్రధాన ముద్దాయిలుగా తేలిన ఇద్దరికి ఉరిశిక్ష విధించాల్సిందిగా కోర్టు తీర్పు ఇచ్చింది. అలాగే, ఇదే కేసులో దోషులుగా తేలిన 21 మందిలో ఇద్దరికి ఉరిశిక్ష పడగా, మగిలిన వారికి ఐదు నుంచి 15 సంవత్సరాల చొప్పున జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.