అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని మన్మోహన్ సింగ్ తన జీవితంలో మరిచిపోలేని ఆతథ్యాన్ని అందుకున్నారు. శ్వేతసౌధంలో అడుగుపెట్టిన ఆయనకు.. అగ్రదేశం అధ్యక్షుడు బరాక్ ఒబామా హిందీలో ప్రధానికి స్వాగతం పలికారు. మన్మోహన్ జీ.. ఆప్ కా స్వాగత్ హై అంటూ అభినందనపూర్వక సాదర స్వాగతం పలికారు. అనంతరం వారిద్దరు పలు అంశాలపై చర్చించారు. ఇరు దేశాల మధ్య కుదిరిన ప్రతిష్టాత్మక పౌర అణు ఒప్పందం అమలుకు తాము కట్టుబడి ఉన్నట్టు ప్రధానికి ఒబామా గట్టి హామీ ఇచ్చారు.
ప్రధాని మన్మోహన్ సింగ్ ఆహ్వానం మేరకు వచ్చే యేడాది భారత్‌లో పర్యటించనున్నట్టు ఒబామా ప్రకటించారు. ఒబామా మర్యాదపై ప్రధాని స్పందిస్తూ.. ఈ పర్యటన పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాకుండా... ఇది మరిచిపోలేని అనుభూతి అంటూ వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ప్రధాని దంపతులకు ఒబామా దంపతులు అధికారి విందు ఇచ్చారు.