ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » పాక్‌లో ఆత్మాహుతి దాడులను ఖండించిన హిల్లరీ (Pak | Sucide attack | Hillory Clinton | Peshawar | Football Match)
నూతన సంవత్సరం సందర్భంగా పాకిస్థాన్‌లోని వాయువ్య ప్రొవిన్స్‌లో జరిగిన ఆత్మాహుతి దాడులను అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఆమె తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
కొత్త సంవత్సరం సందర్భంగా పెషావర్‌కు సమీపంలోని రెండు గ్రామాల మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ సాగుతున్న స్టేడియంపై ఆత్మాహుతిదళ సభ్యుడు దాడికి పాల్పడిన విషయం తెల్సిందే. ఈ దాడిలో 90 మంది మృత్యువాత పడగా, 80 మంది వరకు గాయపడ్డారు.
ఈ దాడులను అమెరికాతో పాటు.. భారత్ తీవ్రంగా ఖండించాయి. తీవ్రవాదాన్ని అణిచి వేయడంలో పాకిస్థాన్‌కు అమెరికా ఎల్లవేళలా అండగా ఉంటుందని హిల్లరీ క్లింటన్ హామీ ఇచ్చారు.
భవిష్యత్‌లో పాకిస్థాన్ ప్రజలు తీవ్రవాద భయాందోళనల నుంచి పూర్తిగా విముక్తి పొంది సుఖ సంతోషాలతో జీవించేందుకు అవసరమైన సహాయ సహకారాలను అమెరికా అందిస్తుందని ఆమె శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.