ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీ బీఎన్‌పీ హెచ్చరిక! (India | Bangladesh | Khaleda Zia | Dhaka | Sheikh Hasina)
బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీ బీఎన్‌పీ హెచ్చరిక!
శనివారం, 2 జనవరి 2010( 14:55 IST )
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా చేపట్టే న్యూఢిల్లీ పర్యటనలో దేశానికి హాని కలిగించే రీతిలో ఏకపక్ష ఒప్పందాలను భారత ప్రభుత్వంతో కుదుర్చుకుంటే మాత్రం తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (బీఎన్పీ) అధినేత్రి ఖలీదా జియా హెచ్చరించారు. దేశ ప్రయోజనాలకు హాని కలిగించే రీతిలో జరిగే ఎలాంటి ఒప్పందాన్నైనా తాము అంగకరించబోమని ఆమె ప్రకటించారు.
దీనిపై ఆమె శనివారం ఒక టీవీ ఛానల్‌తో మీడియాతో మాట్లాడుతూ మరో నాలుగు రోజుల్లో షేక్ హసీనా భారత్‌లో పర్యటించనున్నారు. ఆ సమయంలో ఆమె ఆ దేశంతో కొన్ని ఒప్పందాలను కుదుర్చుకోనున్నారు. అయితే ఈ ఒప్పందాలు దేశ ప్రయోజనాలకు భంగం కలిగించే రీతిలో ఏకపక్షంగా ఉంటే మాత్రం సహించబోమని హెచ్చరించారు.
ఇలాంటి ఒప్పందాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా తమ పార్టీ కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపడుతారని ప్రకటించారు. సరిహద్దుల్లో తిపైముక్ డ్యామ్ నిర్మాణానికి భారత్‌కు బంగ్లా అనుమతి ఇస్తే వీధుల్లోకి ఆందోళనకు దిగడం మినహా మరో మార్గం లేదని ఖలీదా జియా అన్నారు. 2008 డిసెంబరు 29వ తేదీ తర్వాత జరిగిన బహిరంగ సభ అనంతరం ఖలీదా జియా మీడియా ముందుకు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
ఇదిలావుండగా, జనవరి పదో తేదీ నుంచి షేక్ హసీనా భారత్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటన మూడు రోజుల పాటు సాగనుంది. ఈ పర్యటనలో ఇరు ద్వైపాక్షిక, వాణిజ్య ఒప్పందాలతో పాటు జలాల పంపిణీ, ఇంధన సహకారం తదితర అంశాలపై ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయి.