జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » కొత్తగా మరో పది అణు కేంద్రాల ఏర్పాటు: ఇరాన్ (Iran | Nuclear reactor | Uranium | UN | Ahmadinejad)
Bookmark and Share Feedback Print
 
అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడిని ఇరాన్ ఖాతరు చేయడం లేదు. తాను చేపట్టిన అణు కార్యక్రమాన్ని యధేచ్చగా కొనసాగిస్తోంది. ఇందులోభాగంగా, కొత్తగా మరో పది అణు విద్యుత్ కేంద్రాలను నెలకొల్పనున్నట్టు ఇరాన్ అణు ఇంధన సంస్థ డైరక్టర్ ఆలీ అక్బర్ సలేహీ వెల్లడించారు.

ఆయన సోమవారం ఒక అరబిక్ టీవీ ఛానల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. మంగళవారం నుంచి యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ అణు ఇంధన సంస్థకు తెలిపినట్టు చెప్పారు. ఇందుకోసం కొత్త పది అణు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తమ వద్ద ఉన్న యురేనియంలో 20 శాతం మేరకు యురేనియంను శుద్ధి చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు.

ఈ మేరకు తమ దేశ అధ్యక్షుడు అహ్మదినేజాద్ ఆదేశాలు జారీ చేశారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే, తమ అణు కార్యక్రమంలో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేయాల్సిన అవసరం లేదన్నారు. దీనిపై కూలంకుషంగా చర్చలు జరిపేందుకు తమ ద్వారాలు ఇప్పటికీ తెరిచే ఉంచామన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.