జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » తాలిబాన్ చీఫ్ హకీముల్లా మృతిని ధృవీకరించిన పాక్ (Pak Taliban | Hakimullah | Death | Drone | Waziristan)
Bookmark and Share Feedback Print
 
పాకిస్థాన్‌లోని తాలిబాన్ చీఫ్ హకీముల్లా మృతిని పాకిస్థాన్ ధృవీకరించింది. అమెరికాకు చెందిన మానవ రహిత విమానాలు (ద్రోన్) జరిగిన దాడుల్లో తీవ్రంగా గాయపడిన ఆయన ప్రాణాలు కోల్పోయినట్టు పాకిస్థాన్ నిర్ధారించింది.

ఔరాజాయ్ ట్రైబల్ రీజియన్‌కు చెందిన తాలిబాన్ వర్గాలు ఒక టీవీకి అందించిన సమాచారం మేరకు.. 28 సంవత్సరాల హకీముల్లా ద్రోన్ దాడుల్లో తీవ్రంగా గాయపడినట్టు పేర్కొంది. జనవరి 14వ తేదీన నార్త్ వజీరిస్థాన్ ఏజెన్సీలోని షక్టోయ్ అనే ప్రాంతంలో ఈ దాడులు జరిగాయి.

కాగా, ఈ దాడుల్లో తీవ్రంగా గాయపడిన మెసూద్ పంజాబ్‌లోని ముల్తాన్ నగరంలో చికిత్స పొందుతూ వచ్చినప్పటికీ ఆయన ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడలేదు. దీంతో చికిత్స కోసం కరాచీకి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన మెసూద్ ప్రాణాలు కోల్పోయినట్టు పేర్కొంది.

మృతదేహాన్ని తిరిగి గిరిజన ప్రాంతానికి తీసుకెళ్లినట్టు తెలిపారు. పాకిస్థాన్‌లోని అయితే, తెహ్రీక్ ఇ తాలిబాన్ సంస్థ ప్రతినిధి అజామ్ తారిఖ్ మాత్రం మెసూద్ మృతిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆయన ఇంకా ప్రాణాలతోనే ఉన్నారని పేర్కొనడం గమనార్హం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.