ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » జాక్సన్ మృతికి, నాకు ఎలాంటి సంబంధం లేదు: ముర్రే (Michael Jackson | Pop music | Pop star | Family Dr | Conrad murray | Loss angelina | Postmortem | Superior court | Judge | Keith Show Vaart)
ప్రపంచ పాప్ సంగీత సామ్రాజ్యంలో అగ్రపథంలోనున్న నాటి పాప్‌స్టార్ మైఖేల్ జాక్సన్ మృతికి తనకు ఎలాంటి సంబంధం లేదని జాక్సన్ వ్యక్తిగత వైద్యుడు ముర్రే లాస్ ఏంజిలెన్‌లోని కోర్టులో నేడు వెల్లడించాడు.
మైఖేల్ జాక్సన్ నిరుడు జూన్ 25న మృతి చెందిన తర్వాత అతనికి ప్రపోఫాల్ అనే మందును మోతాదుకు మించి ఇవ్వడం వల్లనే జాక్ మృతి చెందినట్లు పోస్టు మార్టం నివేదికలో వెల్లడైంది. దీంతో జాక్సన్ మృతికి అతని వ్యక్తిగత వైద్యుడు కొన్రాడ్ ముర్రే నే ప్రధాన కారణమని జాక్సన్ కుటుంబీకులు ఆయనపై కోర్టులో కేసు దాఖలు చేశారు.
లాస్ ఏంజిలెన్‌లోని కోర్టులో ముర్రేపై కేసు దాఖలు చేయడంతో అది మంగళవారం విచారణకు వచ్చింది. విచారణ సందర్భంగా లాస్ ఏంజిలెన్ కౌంటీ సుపీరియర్ కోర్టు న్యాయమూర్తి కీత్ షువార్ట్ ముందు ముర్రే విచారణకు హాజరయ్యారు. విచారణలో న్యాయమూర్తి అడిగిన పలు ప్రశ్నలకు ముర్రే ముక్తసరిగా సమాధానమిచ్చారు.
విచారణ తర్వాత 75 వేల డాలర్లు అంటే దాదాపు రూ. 35 లక్షల పూచీకత్తుపై ముర్రేకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతోపాటు అతని వద్దకు చికిత్స నిమిత్తం వచ్చే ఏ రోగికీ అనస్థీషియా మందు ఇవ్వకూడదని, దేశం విడిచిపెట్టి వెళ్ళకూడదని షరతులు విధించింది. తదుపరి విచారణ మార్చి నెల ఐదున జరుగనుంది.
ఇదిలావుండగా ముర్రే విచారణ నిమిత్తం కోర్టు హాలులోకి ప్రవేశిస్తుండగా మైఖేల్ జాక్సన్ అభిమానులు ముర్రే హంతకుడంటూ నినాదాలు చేయడం గమనార్హం. కాగా జాక్సన్ మృతి కేసులో ముర్రే దోషిగా రుజువైతే కనీసం నాలుగేళ్ళ జైలు శిక్ష పడే అవకాశం ఉందని కోర్టు వర్గాలు వెల్లడించాయి.