జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » భారత్-చైనాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు! (Agni-III | India | China | pose | threat | each other | Beijing)
Bookmark and Share Feedback Print
 
భారత్-చైనాల మధ్య సంబంధాలు స్నేహపూర్వకంగా, సహకారపూరిత వాతావరణంలో ముందుకు సాగుతున్నాయని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మా ఝాజు అన్నారు. ఈనెల ఏడో తేదీన భారత్ ప్రయోగించిన అగ్ని-3 క్షిపణి చైనాలోని పలు కీలక నగరాలను లక్ష్యంగా చేసుకుని ప్రయోగించినట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

దీనిపై ఆయన స్పందించారు. అగ్ని-3 మిస్సైల్ లక్ష్యం 3,500 కిలోమీటర్లుగా వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. చైనా, భారత్‌ల మధ్య సంబంధాలు స్నేహపూర్వకంగా ఉన్నాయని గుర్తు చేశారు. అందువల్ల మీడియాలో వస్తున్న వార్తలపై తానేమీ వ్యాఖ్యానించబోన్నారు.

చైనా వల్ల భారత్‌కు ఎలాంటి హాని కలుగదు. అలాగే, భారత్ నుంచి చైనాకు ఎలాంటి హాని కలగదని ఆశిస్తున్నట్టు ఆ దేశ అధికారిక వార్తా సంస్థ జినూహా న్యూస్ ఏజెన్సీతో అన్నారు. ఈ రెండు దేశాలు ఒకదానికొకటి బెదిరింపులకు దిగబోవన్నారు. భారత్-చైనాల మధ్య సంబధాలు మంచి సుహృద్భావ వాతావరణంలో సాగుతున్నాయని ఆయన అన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.