ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » శ్రీలంక పార్లమెంట్‌ను రద్దు చేసిన మహీందా రాజపక్సే! (Sri Lanka | Parliment | Rajapakse | President Election | Sarath Fonseka)
శ్రీలంక పార్లమెంట్‌ను రద్దు చేసిన మహీందా రాజపక్సే!
అధ్యక్ష ఎన్నికల్లో విజయభేరీ మోగించిన శ్రీలంక ప్రెసిడెంట్ మహీందా రాజపక్సే రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో లభించిన విజయం స్ఫూర్తితో పార్లమెంట్ ఎన్నికల్లోనూ విజయాన్ని సొంతం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ఆయన ఆ దేశ పార్లమెంట్‌ను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించారు.
ప్రస్తుత పార్లమెంట్ గడువు వచ్చే ఏప్రిల్ వరకు ఉంది. అయితే, రెండు నెలల ముందుగానే పార్లమెంట్‌ను రద్దు చేయడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. అధ్యక్ష ఎన్నికల్లో లభించినట్టుగానే.. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గెలుపును సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు.
అధ్యక్ష ఎన్నికల్లో తనతో తలపడిన ఆ దేశ ఆర్మీ మాజీ చీఫ్ శరత్ ఫోన్సెకాను శ్రీలంక సైన్యం అదుపులోకి తీసుకున్న మరుసటి రోజే ఆయన పార్లమెంట్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం.