జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య చర్చలు: అమెరికా హర్షం! (India | Pakistan | America | Barack Obama | Hillary Clinton)
Bookmark and Share Feedback Print
 
FILE
ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా భారత్-పాకిస్థాన్‌ల మధ్య శాంతియుత చర్చలు ప్రారంభం కావడంపై అగ్ర దేశమైన అమెరికా హర్షం వ్యక్తం చేసింది.

ఇంకా భారత్, పాకిస్థాన్‌ల మధ్య ముఖాముఖి శాంతి చర్చలు జరగడాన్ని అమెరికా స్వాగతించింది. ఇరు దేశాల ప్రయోజనాల కోసం జరిగే భారత్-పాక్ చర్చలకు తాము పూర్తి మద్దతిస్తున్నామని అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ స్పష్టం చేశారు.

దేశ రాజధాని నగరం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో గురువారం భారత్ పాక్ విదేశాంగ కార్యదర్శులు శాంతి చర్చలు ఆరంభానికి కొన్ని గంటల ముందే హిల్లరీ క్లింటన్ ఈ ప్రకటన విడుదల చేయడం విశేషం. ముంబైలో జరిగిన ఉగ్రవాదుల మారణకాండకు తర్వాత భారత్-పాకిస్థాన్‌ల మధ్య శాంతి చర్చలు జరగడం ఇదే తొలిసారి.

ఈ నేపథ్యంలో ఇండో-పాక్ చర్చలపై అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ విడుదల చేసిన ప్రకటనలో.. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం ఆరంభమైన చర్చలు శాంతియుత ఫలితాలనే అందించగలవన్న ఆశాభావాన్ని ఒబామా ప్రభుత్వం వ్యక్తం చేస్తున్నట్టు వెల్లడించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.