ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » మైఖేల్‌కు మహిళలంటే చాలా ఇష్టం: వ్యక్తిగత భద్రతా సిబ్బంది (Pop Music | Michael | Women | Mike garcia | Bill whitfield | Jevon bj biyard)
మైఖేల్‌కు మహిళలంటే చాలా ఇష్టం: వ్యక్తిగత భద్రతా సిబ్బంది
బుధవారం, 10 మార్చి 2010( 21:15 IST )
పాప్ సంగీత సామ్రాజ్యంలో ఓ వెలుగు వెలిగిన పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్‌కు మహిళలంటే చాలా ఇష్టమని ఆయన భద్రతా వర్గాలు తెలిపాయి.
పాప్ గాయకుడైన దివంగత మైఖేల్ జాక్సన్‌కు గతంలో పలు చిన్నారులను లైంగికంగా వేధించేవాడని అతనిపై పలు అనుమానాలున్నాయి. కాని అతనికి మహిళలంటే చాలా ఇష్టమని, సాధారణ పురుషుల్లాగే అతనికి కూడా కోరికలుండేవని అతని వ్యక్తిగత భద్రతాధికారులు మైక్ గార్సియా, బిల్ వ్హిట్ ఫీల్డ్, జేవన్ బీజే బీయర్డ్‌లు తెలిపారు. అతనికి కేవలం మత్తుపదార్థాలను శరీరంలోకి ఎక్కించుకునే అలవాటుండేదని, దీంతోపాటు అతనిలో మంచి రసికుడు కూడా దాగివున్నాడని వారు తెలిపారు.
మైఖేల్ భద్రతను పర్యవేక్షించే బిల్ వ్హిట్ ఫీల్డ్ మాట్లాడుతూ తాము పురుషులం కాబట్టి పురుషుని బాధేంటో చెప్పగలమని, అతనిలోనున్న కోరికలేంటో కూడా తమకు తెలుసునని ఆయన అన్నారు. అతనితో తాము చాలా సంవత్సరాలపాటు ఉన్నామని, అతను నిజమైన మగవాడని, అతనికి మహిళలంటే చాలా ఇష్టమని, వారితో రమించేవాడని ఆయన తెలిపారు. అతనికి చాలా మంది ప్రేమికులున్నారు. అతని కాన్వాయ్‌లోని కార్లలో వెనుకవైపున్న భాగంలో కర్టెన్లుండేవని, దీంతో వెనుక ఏం జరుగుతుందో తాము చూడలేమని చెప్పారు.