ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » మనిషి జీవిత చక్రంలో సోకే వ్యాధులు సంఖ్య 6,284..! (Man Life cycle | Survey | britain | muscles of human body | International)
ఒక మనిషి పూర్తికాల జీవితంలో సోకే వ్యాధుల సంఖ్య 6,284గా ఉంటుందని లండన్‌కు చెందిన వైద్య పరిశోధకులు తేల్చారు. జలుబు, తలనొప్పి, వెన్నునొప్పి, కండరాల నొప్పులు, కాలు నొప్పి ఇలాంటివే ఎక్కువగా వస్తుంటాయని పేర్కొంది. బ్రిటన్‌కు చెందిన ఒక వైద్య సంస్థ ఒక మనిషి జీవిత చక్రంపై సర్వే నిర్వహించింది. ఒక వ్యక్తికి అతని పూర్తికాల జీవితంలో 6,284 వ్యాధులు సోకుతాయని ఆ సర్వే వెల్లడించింది.
అలాగే, ఎలాంటి వ్యాధులు బారిన పడకుండా ఉండాలని అత్యంత జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. అలాంటి వారు కూడా తన పూర్తి వయస్సులో కనీసం 80 చిన్నతరహా వ్యాధులకు లోనవుతున్నట్టు తేలింది. అంతేకాకుండా, మనిషికి వచ్చే వివిధ రకాల నొప్పుల కోసం తన జీవిత కాలంలో మొత్తం 1,649 సార్లు నొప్పుల నివారణ మందులు వాడుతారని తేల్చింది.
అనేక మందికి కండరాల నొప్పులే అధికంగా వస్తాయని పేర్కొంది. ఈ నొప్పులు జీవిత కాలంలో 1,492 సార్లు వస్తాయని తెలిపింది. అలాగే తలనొప్పి 1,256 సార్లు వస్తుందట. అనేక మందికి ఎక్కువగా వచ్చే నొప్పుల్లో వెన్ను నొప్పి మూడో స్థానాన్ని ఆక్రమించింది. ఇది ఒక వ్యక్తి జీవితంలో 1,099 సార్లు వస్తుందని బ్రిటన్ సర్వే వెల్లడించింది.