ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » మేఘాలయా - బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కాల్పుల మోత! (Meghalaya | Bangladesh | Firing | Rounds | Border villages)
మేఘాలయా, బంగ్లాదేశ్ సరిహద్దులు కాల్పులతో దద్దరిల్లాయి. మేఘాలయ సరిహద్దు గ్రామమైన ముక్తాపూర్ సమీపంలో ఇరు దేశాల సరిహద్దు దళాల మధ్య ఈ ఫైరింగ్ జరిగినట్టు తెలుస్తోంది. మేఘాలయ సరిహద్దు గ్రామమైన ముక్తాపూర్ సమీపంలోకి బంగ్లాదేశ్ రైఫిల్స్ మోహరించాయి.
అలాగే, బంగ్లా సరిహద్దు గ్రామాలను భారత సరిహద్దు దళం ఖాళీ చేయించింది. దీంతో సరిహద్దుల్లో ఎపుడు ఏం జరుగుతుందో తెలియక ప్రజలు బిక్కుబిక్కుంటూ జీవనం గడుపుతున్నారు. ఆదివారం రాత్రి నుంచి మంగళవారం వరకు ఇరు దేశాల సరిహద్దు దళాల మధ్య వెయ్యి రౌండ్లు కాల్పులు జరిగినట్టు సమాచారం.
అయితే, ఇటీవల ఇరు దేశాల సైన్యం మధ్య ఫిబ్రవరి 4వ తేదీ నుంచి నాలుగుసార్లు కాల్పుల పరిస్థితి తలెత్తింది. బంగ్లా రైఫిల్స్ పేల్చిన బుల్లెట్ దెబ్బలతో మేఘాలయ సరిహద్దు గ్రామం ముక్తాపూర్‌లోని చాలావరకూ ఇళ్లు పెచ్చులూడి పోయాయి.