ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » భారత్ చర్చల ప్రతిపాదనపై సమాచారం లేదు: పాకిస్థాన్ (India | Pakistan | Forign secretary | Islamabad | Krishna | Khureshi)
భారత్-పాకిస్థాన్ దేశాల విదేశాంగ కార్యదర్శుల స్థాయి సమావేశంలో భాగంగా తదుపరి చర్చలు ఇస్లామాబాద్‌లో జరుగుతాయని భారత్ చేసిన వ్యాఖ్యలపై తమకెలాంటి సమాచారం లేదని పాకిస్థాన్ విదేశాంగ శాఖ అభిప్రాయపడింది. దీనిపై ఆ శాఖ కార్యదర్శి బషీర్ అహ్మద్ మాట్లాడుతూ ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శుల రెండో దఫా చర్చలు ఇస్లామాబాద్‌లో జరుగుతాయని భారత విదేశాంగ మంత్రి ఎస్ఎం.కృష్ణ చేసిన వ్యాఖ్యల గురించి తమకేమీ తెలియదన్నారు.
ఇందుకు సంబంధించి ఎలాంటి సమాచారం తమకు అందలేదన్నారు. అయితే, వాషింగ్టన్‌లో భారత విదేశాంగ కార్యదర్శి నిరుపమా రావు మాట్లాడుతూ.. తీవ్రవాదం అణిచివేతకు పాక్ కఠిన చర్యలు తీసుకోవడం లేదని, అందువల్లే ఆ దేశంతో చర్చలకు ఆసక్తి చూపడంలేదన్నారనే విషయాన్ని గుర్తు చేశారు.
దీనిపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. తీవ్రవాదంపై తాము కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నామన్నారు. ఇతర దేశాలకంటే తామే ఎక్కువగా తీవ్రవాద దాడుల బారిన పడినట్టు విదేశాంగ కార్యదర్శి తెలిపారు.