జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » దావూద్‌కు కుటుంబాన్ని మరో చోటికి తరలించే యోచన? (ISI | Dawood Ibrahim | Pakistan | D company | India | Mumbai blasts | S Africa)
Bookmark and Share Feedback Print
 
పాకిస్థాన్‌లో ఉంటున్న తన కుటుంబాన్ని మరో చోటికి తరలించాలనే యోచనలో అండర్ వరల్డ్ దావూద్ ఇబ్రహీం‌ ఇన్నట్టు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ఒత్తిడి అధికం కావడంతో పాక్‌లో నెలకొన్న పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేకపోవడంతో మరో సురక్షితమైన ప్రాంతానికి తరలించేందుకు ఆయన సన్నాహాలు చేస్తున్నట్టు వినికిడి.

డీఎన్ఏ డైలీ ప్రచురించిన కథనం మేరకు.. ఐఎస్‌ఐ నుంచి వస్తున్న ఒత్తిడితో డి కంపెనీ ఆందోళన చెందుతోంది. అందువల్ల దావూద్ తన కుటుంబాన్ని పాకిస్థాన్ నుంచి శాశ్వతంగా మరో సురక్షితమైన దేశానికి తరలించేందుకు నిర్ణయించారు. ఆయన దక్షిణాఫ్రికాను ఎంపిక చేసినట్టు తెలుస్తోందని పేర్కొంది.

ఈ విషయాన్ని గత ఫిబ్రవరి ఆరో తేదీన నవీ ముంబైలో అరెస్టు చేసిన దావూద్‌ అత్యంత దగ్గరి సన్నిహితుడు ఫిరోజ్ అబ్దుల్ రషీద్ ఖాన్ అలియాస్ హంజా వెల్లడించినట్టు తెలిపింది. ఈయన 1993లో ముంబైలో జరిగిన వరుస బాంబు పేలుళ్ళ కేసులో ప్రధాన నిందితుడు. ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్నాడు.

దావూద్, ఛోటా షకీల్, అనీస్ ఇబ్రహీం, టైగర్ మీనన్‌లు తమ కుటుంబ సభ్యుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వారిని సురక్షిత ప్రాంతానికి తరలించాలని భావిస్తున్నారని హంజా వెల్లడించాడు. ప్రస్తుతం పాక్‌లో నెలకొన్న పరిస్థితులు తమ కుటుంబాలకు ఏమాత్రం క్షేమం కాదని వారు భావిస్తున్నారు. దీంతో పాటు ఐఎస్ఐ నుంచి తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోందని దర్యాప్తులో పేర్కొన్నాడు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.