జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » వాయువ్య పాక్‌లో భారీ వర్షాలు: 50 మంది మృత్యువాత (Northwest pakistan | Heavy rains | Kaiber | Floods | International)
Bookmark and Share Feedback Print
 
గత కొన్నిరోజులుగా వాయువ్య పాకిస్థాన్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు 50 మందికి పైగా మృత్యువాత పడ్డారు. అనేక మంది గల్లంతైయ్యారు. వాయువ్య పాకిస్థాన్‌లో కైబర్ అనే ప్రాంతంతో పాటు దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా ఆ ప్రాంతంలో వరదలు సంభవించాయి. లక్షలాది ఎకరాల్లో పంట నష్టమైంది. వేలాది గృహాలు నేలమట్టమయ్యాయి.

వరద బాధిత ప్రాంతాల్లో చిక్కుకున్న బాధిత ప్రజలను వరద సహాయక చర్యల్లో నిమగ్నమైవున్న పాక్ సైనికులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. షనీకా, స్వాత్, కోహ్టా తదితర జిల్లాల్లోని అనేక గ్రామాలు పూర్తిగా నీటమునిగి పోయాయి. భారీ వర్షాలకు గృహాలు నేలమట్టమయ్యాయి. గృహాలు కూలిపోవడం వల్ల ఎక్కువ మంది మృత్యువాత పడినట్టు స్థానిక అధికారులు వెల్లడించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.