ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించనున్న బరాక్ ఒబామా! (US | Obama | America | India | Tour | Parliment Joint sessions | Address)
పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించనున్న బరాక్ ఒబామా!
వచ్చే నవంబరులో న్యూఢిల్లీ పర్యటనకు రానున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయ వర్గాలు సూచన ప్రాయంగా వెల్లడించాయి. ఈ చారిత్రాత్మక పర్యటనకు సంబంధించిన తేదీల ఖరారులో ఇరు దేశాల ఉన్నతాధికారులు నిమగ్నమైవున్నారు.
ప్రపంచంలోని మిలియన్ల మంది ప్రజలకు ఒబామా ఒక మార్గదర్శి అని భారత ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రశంసించిన విషయం తెల్సిందే. అలాగే, ఒబామాతో పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిచేలా ఆయన కృషి చేస్తున్నారు.
ఒబామా పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లూ పూర్తయితేనే తేదీలను ఖరారు చేస్తారని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. అనేకంగా, నవంబరు 9వ తేదీన ఉభయ సభలను ఉద్దేశించి ఒబామా ప్రసంగం చేయవచ్చని సూచన ప్రాయంగా తెలిపాయి. దీనిపై యూఎస్ ఎంబసీ అధికార ప్రతినిధి న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ అధ్యక్షుడు పర్యటన షెడ్యూల్‌కు సంబంధించిన తేదీలను ఇప్పటివరకు ఖరారు చేయలేదన్నారు.