ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » పాకిస్థాన్‌లో భారీ వరదలు: 400 మందికి పైగా మృతి! (Pakistan | Floods | Heavy rains | Afghanistan | International news)
పాకిస్థాన్‌ను భారీ వరదలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వరద కారణంగా ఇప్పటి వరకు సుమారు 400 మంది పైగా మరణించారు. మరో నాలుగు లక్షల మంది వరకు నిరాశ్రయులైనట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. అలాగే ఆప్ఘనిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. వీటికి మరో 60 మంది మృతి చెందారు.
భారీ వర్షాల కారణంగా నదులు పొంగి పొర్లడంతో ప్రజలు నివసిస్తున్న ప్రాంతాల్లో నీట మునిగాయి. అనేక గ్రామాల్లోని గృహాలు వరద నీటి తాకిడికి కొట్టుకుని పోయాయి. గత 80 ఏళ్ల తర్వాత ఇంతటి భారీ వరదలు రావడం ఇదే మొదటిసారని పాక్ ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ఈ వరదలతో పాక్‌లో రవాణా వ్యవస్థ అస్తవ్యస్థమైంది.