ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » భారత్‌లో 2020 నాటికి నీటి కొరత: అమెరికా హెచ్చరిక (India | America | Drinking Water | Robert Black | Washington | International)
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో రెండో స్థానంలో ఉన్న భారత్‌లో మరో పదేళ్ల తర్వాత తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడుతుందని అమెరికా హెచ్చరించింది. రాష్ట్రాల మధ్య నెలకొనే నీటి, సరిహద్దు సమస్యల కారణంగా ఈ నీటి కొరత నెలకొంటుందని అమెరికా విదేశాంగ సహాయ మంత్రి రాబర్ట్ బ్లేక్ అభిప్రాయపడ్డారు.
వాషింగ్టన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాబర్ట్ బ్లేక్ మాట్లాడుతూ పెరుగుతున్న జనాభా, నగరాభివృద్ధి వంటి ఇతరాత్రా కారణాల వల్ల తాగునీటి కొరత తథ్యమన్నారు. భారత్‌లో 12 శాతం ప్రజలకు సురక్షిత మంచినీరు లభించడం లేదన్నారు. 2009లో దేశంలో మొత్తం 626 జిల్లాలు కరువు బాధిత ప్రాంతాలుగా ప్రకటించారన ఆయన గుర్తు చేశారు. భారత్‌లో 75 శాతం తాగునీరు కేవలం మూడు నెలల్లో కురిసే వర్షాల ద్వారా లభ్యమవుతుందన్నారు.
అయితే వర్షపు నీటిని నిల్వ చేసేందుకు తగిన వసతులు లేవన్నారు. ఇంకా చెప్పాలంటే... నగర ప్రాంతాల్లో తాగునీటిని డబ్బు చెల్లించి పొందాల్సిన పరిస్థితి ఏర్పడిందని రాబర్ట్ అన్నారు. నగరాల్లో మాత్రం 40 శాతం కుటుంబాలకు తాగునీరు లభించడం లేదని, 36 శాతం వారికి మాత్రమే మరుగు దొడ్ల సౌకర్యం ఉందని బ్లేక్ పేర్కొన్నారు. అపరిశుభ్ర తాగునీటితో ప్రజలు పలు వ్యాధులతో ప్రజలు బాధపడుతున్నారన్నారు. ఈ నీరు తాగడం వల్ల మరణించే చిన్నారుల సంఖ్య పెరుగుతోందన్నారు.
అలాగే, భారత దేశంలోని పలు ప్రాంతాల్లో వ్యవసాయానికి తగినంత సాగునీరు లభించడం లేదన్నారు. 2021వ సంవత్సరానికి మూడింటిలో రెండోవంతు దేశాల్లో తాగునీటి కొరత ఏర్పడే ప్రమాదముందని నిపుణులు హెచ్చరించారు. జనాభా పెరుగుదల, రుతుపవనాల్లో మార్పు, పరిశ్రమల ఏర్పాటు వంటి తదితర కారణాలతో తాగునీటి కొరతను ఎదుర్కోవడం పెను సవాలుగా మారిందన్నారు.