జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » ఎయిర్ బ్లూ విమాన ప్రమాదంలో బ్లాక్‌‌బాక్స్ గుర్తింపు! (Black box | Pakistan | Airblue | Margalla Hills | Islamabad | Cockpit | Found)
Bookmark and Share Feedback Print
 
ఇటీవల పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ సమీపంలోని మార్గాల పర్వత శ్రేణుల్లో జరిగిన ఎయిర్ బ్లూ విమాన ప్రమాదంలో బ్లాక్‌బాక్స్‌ను సహాయక బృందాలు శనివారం కనుగొన్నారు. దీన్ని విశ్లేషించడం ద్వారా ప్రమాదానికి గల కారణాలు తెలియవచ్చని సహాయ బృంద అధికారులు చెపుతున్నారు.

దీనిపై పాకిస్థాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ డైరక్టర్ జనరల్ జనైద్ అమిన్ స్పందిస్తూ.. గాలింపు చర్యల్లో నిమగ్నమైన తమ బృందం ప్రమాదానికి గురైన విమానానికి చెందిన బ్లాక్‌బాక్స్, కాక్‌పీట్ వాయిస్ రికార్డును కనుగొన్నారని, ఈ రెండు తమ ఆధీనంలోనే ఉన్నట్టు చెప్పారు. ఇవి దెబ్బతినకుండా బాగానే ఉన్నాయని, వీటిని డీకోడింగ్ చేయాల్సి ఉందని ఆయన చెప్పారు.

మార్గాల పర్వత ప్రాంతాల్లో ఎయిర్ బ్లూ విమానం ఇటీవల కూలిపోగా, ఈ ప్రమాదంలో 152 మంది మృత్యువాత పడిన విషయం తెల్సిందే. ఈ ప్రమాదానికి సంబంధించి కారణాలు ఇంతవరకు తెలియరాలేదు. వీటిని వెల్లడించే బ్లాక్‌బాక్స్, కాక్‌పీట్ వాయిస్ రికార్డర్ల కోసం సహాయక సిబ్బంది గత కొన్ని రోజులుగా గాలించి చివరకు కనుగొన్నట్టు ఆయన తెలిపారు.

ఇంటర్నేషనల్ ఏవియేషన్ కమ్యూనిటీ సెంటర్‌కు వీటిని పంపి డీకోడింగ్ చేయనున్నట్టు తెలిపారు. కాగా, ఈ ప్రమాదంపై పాక్ దర్యాప్తు బృందాలకు ఫ్రెంచ్ బృందం మొకటి సహాయ పడుతోంది. అందువల్ల బ్లాక్‌బాక్స్‌ను ఫ్రాన్స్ లేదా జర్మనీకి పంపనున్నట్టు ఆయన తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.