జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » సెప్టెంబర్ 24, 2182 తేదీన భూమికి పెనుప్రమాదం...?!! (Asteroid | NASA | Probe | Hurtling Towards Earth | RQ36 | OSIRIS-Rex)
Bookmark and Share Feedback Print
 
త్వరలో భూమిని ఢీకొట్టనున్న గ్రహశకలం(ఆస్ట్రాయిడ్)పై పరిశోధనలు చేపట్టడానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) సన్నాహాలు చేస్తోంది. ఈ పరిశోధన గతంలో తీసిన ఓ హాలీవుడ్ సినిమాను ప్రతిబింబిస్తోంది. 1998లో నిర్మించిన "ఆర్మగెడ్డాన్" అనే హాలీవుడ్ చిత్రం కూడా ఇదే కాన్సెప్ట్‌ మీద తీసినదే. ఈ చిత్రంలో భూమిని ఢీకొట్టనున్న ఆస్ట్రాయిడ్‌ మీదకు అమెరికాకు చెందిన ఓ స్పేస్‌షిప్‌ను అంతరిక్షంలోకి పంపించి పరిశోధనలు చేస్తుంటారు. ఇదే వైపరీత్యం నిజరూపం దాల్చనున్నదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

"అంతరిక్షంలో ఏర్పడిన ఆర్‌క్యూ36 అనే ఆస్ట్రాయిడ్ (గ్రహశకలం) 2200 సంవత్సరం లోపు భూమిని డీకొట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే.. ఇలా జరగడానికి వెయ్యిలో ఒకవంతు మాత్రమే అవకాశం ఉంది. ఒకవేళ ఇది గనుక భూమిని ఢీకొడితే అప్పుడు సంభవించే విస్ఫోటనం కొన్ని వందల న్యూక్లియర్ బాంబులతో సమానం" అని టెలిగ్రాఫ్ నివేదికలు వెల్లడిస్తున్నాయి.

అయితే కొన్ని పరిశోధనల ఆధారంగా ఇది దాదాపుగా సెప్టెంబర్ 24, 2182 తేదీన భూమిని ఢీకొట్టవచ్చని చెబుతున్నాయి. కానీ.. శాస్త్రవేత్తలు మాత్రం దీని గురించి పూర్తిగా అధ్యయనం చేయడానికి ఈ గ్రహశకలం నుంచి చిన్న ముక్కలను సేకరించి పరిశోధనలు చేపట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది.

ఇందుకు నాసా గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. 2106 సంవత్సరంలో అంతరిక్ష విమానం ఈ గ్రహశకలాన్ని బద్దలు చేసి దాని నుంచి వెలువడిన చిన్న ముక్కలను సేకరించనుంది. ఈ గ్రహశకలం 1,800 అడుగులు విస్తీర్ణంలో ఉన్నట్లు నాసా తెలిపింది.

ఈ ప్రతిపాదిత మిషన్(ప్రణాళిక)ను నాసా "ఓస్రిస్-రెక్స్" అని నామకరణం చేసింది. ఈ మిషన్‌ను చేపట్టడానికి చాలా సంస్థలు పోటీపడగా వాటిలో రెండిటిని ఖరారు చేశారు. అందులో ఒక సంస్థ ఈ మిషన్‌కు సంబంధించిన పనులను చేపట్టనుంది.

ఇందులో రెండవ పోటీదారుడు శుక్ర గ్రహం మీదకు చేరుకుంటారు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వాషింగ్టన్‌లో రెండు రోజుల పాటు జరిగే నాసా వర్క్‌షాప్‌లో చర్చించనున్నారు. ఈ రెండు పోటీదారుల్లో విజేతగా నిలిచినవారిని వచ్చే సంవత్సరం వెల్లడిస్తారు.

ఆర్‌క్యూ36 "అత్యంత శక్తి గల ప్రమాదకరమైన గ్రహశకలం" అని నాసా అధికారికంగా వెల్లడించింది. ఇది భూమి వైపు 2,80,000 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుందని తెలిపింది. దీని కక్ష్య భూమికి దగ్గరగా వస్తుండటంతో.. మిగతా ఆస్ట్రాయిడ్‌లను చేరుకోవటం కన్నా దీనిని చేరుకోవడం చాలా సుళువు.

ఆర్‌క్యూ36 కారణంగా సంభవించే విస్ఫోటనం చాలా ప్రమాదకరమైనదని కొలరాడోలోని బ్లండర్‌లో ఉన్న సౌత్‌వెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్‌కు చెందిన శాస్త్రవేత్త క్లార్క్ చాప్‌మ్యాన్ అన్నారు. గత ఏడాది అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆధ్వర్యంలో నాసా భవిష్యత్ అంతరిక్ష కార్యక్రమాలను పర్యవేక్షించటానికి ఓ నిపుణుల బృందాన్ని నియమించిన సంగతి తెలిసిందే.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.