జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » గిల్జిత్‌లో మా సైనిక బలగాలా? నో ఛాన్స్!: చైనా ప్రధాని (China | Kashmir | Gilgit | Pakistan | China Army | International)
Bookmark and Share Feedback Print
 
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని గిల్జిత్ ప్రాంతంలో చైనా సైనిక బలగాలను మోహరించినట్లు వస్తున్న వార్తలను చైనా ప్రధాన మంత్రి వెనజియబావో తోసిపుచ్చారు. గిల్జిత్-పాకిస్థాన్ ప్రాంతంలో 11వేల సైనిక బలగాలను చైనా మోహరించిందనడంలో నిజం లేదని జియబావో స్పష్టం చేశారు.
గిల్జిత్ ప్రాంతంలో చైనా సైనిక బలగాల మోహరింపు పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆక్రమిత కాశ్మీర్‌లో చైనా సైనిక బలగాల మోహరింపు అంశంపై చైనాలోని భారత రాయబారి ఎస్. జయ శంకర్, చైనా విదేశాంగ శాఖ మంత్రి జాంగ్ జీ జూంగ్‌లు బీజింగ్‌లో సమావేశమయ్యారు.

ఈ భేటీలో కాశ్మీర్ ప్రాంతంలో సైనిక బలగాల మోహరింపు పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ఎస్. జయశంకర్ చైనా మంత్రులతో తెలియజేశారు. గిల్జిత్-పాకిస్థాన్ ప్రాంతంలో తమ దేశానికి చెందిన సైనిక బలగాలను మోహరించలేదని చైనా పేర్కొన్న నేపథ్యంలో భారత్ తమ ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం.

ఇకపోతే.. గిల్జిత్ ప్రాంతంలో చైనా సైనిక బలగాలపట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయాన్ని చైనాకు తెలియజేసిన అనంతరం జయశంకర్ ఢిల్లీకి చేరుకున్నారు. ఇదే విషయాన్ని కేంద్ర భద్రతా మండలికి వివరించిన జయశంకర్ గురువారం రాత్రి తిరిగి బీజింగ్‌కు ప్రయాణమయ్యారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.