ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » ఆర్థిక సంక్షోభంలో ఆప్ఘనిస్థాన్ తాలిబన్లు: యూఎస్ (Afghanistan | America | Pentagon | Taliban | Financial Funds | Helmand province)
ఆప్ఘనిస్థాన్‌లోని తాలిబన్లు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నట్టు అమెరికా నిఘా వర్గాలు సేకరించిన సమాచారంలో వెల్లడైంది. ఈ విషయాన్ని ఆప్ఘన్‌లోని అమెరికా జనరల్ ఒకరు వెల్లడించారు. గత యేడాది ఇదేసమయంలో ఉన్నంత నిధులు ప్రస్తుతం వారి వద్ద లేవని, ఫలితంగా ఆయుధాలతో మందుగుండు సామాగ్రిని కొనుగోలు చేయలేని దయనీయ పరిస్థితిలో ఉన్నట్టు నౌకా విభాగానికి చెందిన మేజర్ జనరల్ రిచర్డ్ మిల్స్ తెలిపారు. ఈ మేరకు ఆయన అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ ప్రెస్ విభాగానికి సమాచారం చేరవేశారు.
ఆప్ఘన్‌లో పోరు సాగిస్తున్న అమెరికా సైనికులు తాలిబాన్ ప్రధాన వ్యాపారమైన నల్లమందు ఖజానాను లక్ష్యంగా చేయడం, వారికి నల్లమందు లాభాలు అందకుండా చేయడం వల్ల నిధుల కొరత ఏర్పడినట్లు ఆయన పేర్కొన్నారు. తనకు అందిన నిఘా వర్గాల సమాచారం మేరకు హెల్మాండ్ రాష్ట్రంలోని తాలిబాన్ స్థానిక శాఖకు గత సంవత్సరంలో ఉన్న నిధుల్లో సగం కూడా ఇప్పుడు అందుబాటులో లేవని పేర్కొన్నారు.