జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » అతనో భిక్షాధిపతి.. ఆహా కాదు కాదు లక్షాధిపతి! (Millionaire Beggar | Begging | Britain | Daniel Terry | Girlfriend)
Bookmark and Share Feedback Print
 
సాధారణంగా మనం డబ్బు సంపాధించటానికి నానా కష్టాలు పడుతుంటాం. రాత్రి పగలు శ్రమించి పైసా పైసా కూడబెడితే కానీ.. లక్షాధికారులు కాలేం. అదే బ్రిటన్‌లో ఏంజరిగిందో తెల్సా... భిక్షాటన చేసే ఓ బిచ్చగాడు సంవత్సారానికి 23,400 పౌండ్లు సంపాదిస్తున్నాడు. అంటే మన కరెన్సీలో రూ.16,83,000లు. వామ్మో... ఒక బిచ్చగాడికి ఇంత ఆదాయమా.. నిజమేనా...! మీరు నమ్మినా.. నమ్మకపోయినా ఇది నూటికి నూరుపాళ్లు నిజం.

బ్రిటన్‌లో డానియేల్ టెర్రీ అనే యాచకుడ్ని ఇటీవలే పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే బ్రిటన్‌లో భిక్షాటన చట్టరీత్యా నేరం (ఈ రూల్ మన దేశంలో కూడా ఉంటే ఎంత బావుండ్నో కదా..). అనంతరం 100 పౌండ్లు (రూ.7195) జరిమానా విధించారు. గత నెలలో భిక్షగాళ్ల ఏరివేతకు బ్రిటీష్ పోలీసులు కంకణం కట్టుకున్నారు. పాపం దీంతో టెర్రీ దోరికిపోయాడు. 100 పౌండ్లు పోతే పోయాయ్ కానీ.. లైఫ్ సెట్ అయిపోయింది అనుకుంటున్నాడు టెర్రీ.

ఈ టెర్రీ అమ్మా.. అయ్యా.. అని అడుక్కోడు. సింపుల్‌గా ఓ దుప్పటి నెత్తిన వేసుకొని దీనంగా మొహం పెట్టి వచ్చే.. పోయే.. వారు అతనిపై జాలిపడేలా చేస్తాడు. ఇలా రోజుకు 50 పౌండ్లు సంపాదిస్తాడు. శెలవు రోజుల్లో ఇతని ఆదాయం ఇంకొంచెం ఎక్కువే. ఆ రోజుల్లో 100 పౌండ్ల వరకూ వస్తుందట. అంతేనా.. ఇతనికి ఒక సొంత ఫ్లాట్ అందులో ఓ చక్కనైన గర్ల్‌ఫ్రెండ్ కూడా ఉందట.

కానీ.. టెర్రీకు మాత్రం ఈ ఆదాయం సరిపోవటం లేదట. తన గర్ల్‌ఫ్రెండ్‌కు, తనకు పెద్ద మొత్తంలో మొబైల్ బిల్లులు, ఆహారం కోసమే అంతా ఖర్చైపోతుందట. దుబారా జీవితం గడపటానికి టెర్రీ ఏమీ పొదుపు చేసుకోవడం లేదట. ఏదైతేనేం బ్రిటన్‌లో బిచ్చమెత్తుకుంటే లక్షాధికారి అయిపోవచ్చని టెర్రీ నిరూపించేశాడు. పోలీసులకు దొరికితే భిక్షాధికారి.. దొరక్కపోతే లక్షాధికారి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.