జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » న్యూజిలాండ్‌లో భారీ భూకంపం: నేలమట్టమైన క్రెస్ట్‌చర్చ్! (Emergency | New Zealand quake | Wellington | Christchurch | 7.1-magnitude)
Bookmark and Share Feedback Print
 
న్యూజిలాండ్‌లోని కీలక నగరాల్లో ఒకటైన క్రెస్ట్‌చర్చ్‌లో శనివారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని ప్రభావం 7.1గా నమోదైంది. ఫలితంగా ఈ ప్రాంతంలోని అనేక ఆకాశహార్మియాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. దీంతో అప్రమత్తమైన న్యూజిలాండ్ ప్రభుత్వం దేశమంతటా ప్రమాద హెచ్చరికలను జారీ చేసింది.

అయితే, ఈ భూకంపంలో ఆస్తినష్టం భారీగా ఉండగా, ప్రాణనష్ట వివరాలు తెలియాల్సి ఉంది. న్యూజిలాండ్ కాలమానం ప్రకారం తెల్లవారుజామున 4.35 నిమిషాలకు చోటు చేసుకుంది. అందువల్ల ప్రాణనష్టం లేదని స్థానిక అధికారులు చెపుతున్నారు. అయితే, లిట్టీల్టాన్ పోర్టు ప్రాంతం తీవ్రంగా దెబ్బతిన్నట్టు చెప్పారు. ఇది క్రెస్ట్‌చర్చ్‌కు 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతంలో బహుళ అంతస్తులతో కూడిన హోటల్స్, అతిథి గృహాలు కూడా ఉన్నాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.