ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » న్యూజిలాండ్‌లో విమాన ప్రమాదం: 9 మంది దుర్మరణం! (Wellington | New Zealand | Plane crashed | Flames | Killed)
న్యూజిలాండ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతంలో చిన్నపాటి విమానమొకటి కూలిపోయింది. ఈ ప్రమాదంలో విదేశీ పర్యాటకులతో పాటు తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. వెస్ట్‌కోస్ట్ న్యూజిలాండ్ ప్రాంతంలోని ప్రపంచ వారసత్వ పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందిన ఫాక్స్ గ్లేసియర్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఉన్న తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు.
మృతి చెందిన వారిలో పైలట్, నలుగురు న్యూజిలాండ్ పౌరులు, ఐర్లాండ్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, జర్మనీ దేశాలకు చెందిన పర్యాటకులు ఉన్నారు. అయితే, వీరి వయస్సు, లింగత్వం వివరాలు తెలియలేదు. విమానం పేలిన వెంటనే దట్టమైన పొగలు అలముకోవడం వల్లే ప్రమాదం చోటు చేసుకుందని స్థానిక పోలీసులు వెల్లడించారు.
కాగా, ప్రమాదానికి గురైన విమానం స్కైడైవింగ్ కంపెనీకి చెందినదని న్యూజిలాండ్ టెలివిజన్ పేర్కొంది. ఈ విమానం ఎయిర్‌స్టిఫ్‌లో టేకాఫ్ తీసుకున్న వెంటనే పేలి పోయిందని తెలిపింది. ఈ ప్రమాదంపై స్కైడైవ్ న్యూజిలాండ్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ కంపెనీ గత 25 సంవత్సరాలుగా విమానయాన రంగంలో కార్యకలాపాలు సాగిస్తోంది.