ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » షియా తెగ ర్యాలీపై తాలిబన్ల దాడి: 54 మంది మృతి (Pakistan | Taliban | Threatens | US | Islamabad | Sucide bomb attack)
పాకిస్థాన్‌లోని క్వెట్టా ప్రాంతంలో షియా తెగకు చెందిన ప్రజలు నిర్వహిస్తున్న ర్యాలీపై తాలిబన్ ఆత్మాహుతి దళ సభ్యుడు దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో 54 మంది మృత్యువాత పడ్డారు. ఈ దాడి జరిపింది తామేనని పాకిస్థాన్ తాలిబన్ తీవ్రవాద సంస్థ ప్రకటించింది. అంతేకాకుండా మున్ముందు అమెరికా, యూరోప్ దేశాలపై దాడులు చేయనున్నట్టు ఆ సంస్థ హెచ్చరించింది.
ఆప్ఘనిస్థాన్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న తాలిబన్ స్థావరాలపై అమెరికా నేతృత్వంలోని ప్రాశ్చాత్య దేశాలు మానవరహిత విమానాలతో దాడులు జరుపుతున్న విషయం తెల్సిందే. ఈ దాడులు తాలిబన్ నేతలను లక్ష్యంగా చేసుకుని జరుపుతున్నాయని, వీటికి ప్రతీకారం చెల్లించుకోక తప్పదని ఆ సంస్థ తాజాగా హెచ్చరించింది.
ఇదిలావుండగా, షియా తెగ ర్యాలీపై జరిగిన దాడిన వైట్‌హౌస్ ఖండించింది. మృతుల కుటుంబాలకు తమ సానుభూతిని ప్రకటించింది. అలాగే, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ కూడా దాడులను ఖండించారు.