ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » ఆ బ్రిటన్ అవ్వకు 106ఏళ్లు అయినా.. ఇంకా కన్యే..! (106 years old | still a virgin | old woman | Britain | Isa Blyth)
ఈ ప్రపంచంలో కొన్ని సంఘటనలు వింతగానూ, విచిత్రంగానూ, విడ్డూరంగానూ ఉటాయి. ఈ సంఘటన కూడా అలాంటిదే.. ఆ అవ్వకు 106 ఏళ్లు... అయితే ఏంటి అంటారా..? అదే ఇక్కడ అస్సలు విషయం. ఆమెకు 106 ఏళ్లు వచ్చినా ఇంకా కన్యగానే ఉందట. అంతేకాదు ఇంతవరకూ ఎవ్వరినీ ముద్దు కూడా పెట్టుకోలేదట. పైపెచ్చు ఇలా ఒంటరిగా ఉండటం మూలానే ఆమె ఇంతకాలం బ్రతకాడానికి కారణమని కూడా చెబుతుంది.
బ్రిటన్‌కు చెందిన "ఇసా బ్లైత్" అనే అవ్వ ఈ శనివారం తన 106వ పుట్టిన రోజును జరుపుకున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఆమె మాట్లాడుతూ "ఇలా ఎవరైనా ప్రయత్నించారో లేదో నాకు తెలియదు కానీ.. ఒంటరిగా ఉంటం వల్లే నేను ఎక్కువ కాలం జీవించగలిగాను" అని చెప్పుకొచ్చారు. కాగా, ఈ 106 ఏళ్ల పండు ముదుసలి 1904వ సంవత్సరంలో జన్మించారు.
ఆమె వయస్సులో ఉన్నప్పుడు ఫ్లవర్ క్లబ్, చర్చిలకు వెళ్ళడం, పాటలు పాడటం, గోల్ఫ్ ఆడటం, గార్డెనింగ్ చేయటం వంటి పనులు చేసేదట. ఈమె 35 ఏళ్ల పాటు ఇడెన్‌బర్గ్‌లోని ఓ విస్కీ కంపెనీలో పర్సనల్ సెక్రటరీగా పనిచేశారు. ఇప్పటి వరకూ తను ఏ రోజు బాధ పడిన సందర్భాలే లేవని చెపుతోంది. ఈమె తన తల్లిదండ్రులకు మొదటి సంతానం.