జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » ముంబై దాడులు: విచారణ కమిషన్‌కు యోచన: రెహ్మాన్ (Pakistan | Mumbai attack | Rehman Malik | Lashkar)
Bookmark and Share Feedback Print
 
ముంబై దాడులతో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న లష్కరే తోయిబా ఆపరేషన్ కమాండర్ జకీవుర్ రెహ్మాన్‌తో సహా మరో ఆరుగురిపై విచారణ ఆగిపోయిందని పాకిస్థాన్ వెల్లడించింది. ఈ విచారణ ముందుకు సాగాలంటే ఈ కేసులో కీలకమైన ఇద్దరు భారతీయ సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయడానికి ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరముందని పేర్కొంది. ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్టు పాకిస్థాన్ అంతర్గత భద్రతా శాఖామంత్రి రెహ్మాన్ మాలిక్ వెల్లడించారు.

దీనిపై ఆయన శనివారం ఇస్లామాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసు విచారణకు భారత్‌లో ఉన్న సాక్షులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపేందుకు తమ దేశ చట్టాలు అంగీకరించవన్నారు. అందువల్ల ఒక విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసే విషయాన్ని తాము పరిశీలిస్తున్నట్టు తెలిపారు.

ఈ కమిషన్ భారత్ వెళ్లి ముంబై దాడుల్లో పాలు పంచుకున్న పాకిస్థాన్ టెర్రరిస్టు అజ్మల్ కసబ్ నేరాన్ని అంగీకరిస్తూ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసిన మేజిస్ట్రేట్, ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసు అధికారి స్టేట్‌మెంట్లను రికార్డు చేయడానికి సమర్థులైన అధికారులతో ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసే విషయాన్ని ఇటీవల భారత హోం మంత్రి చిదంబరంతో జరిపిన టెలిఫోన్ సంభాషణ సందర్భంగా ఆయనతో చర్చించినట్లు మాలిక్ వెల్లడించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.