ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » డబ్లిన్‌లో టోనీ బ్లెయిర్‌కు బూట్లు, కోడిగుడ్లతో స్వాగతం! (British Former Prime Minister | Tony Blair | Shoes | Eggs | Dublin)
డబ్లిన్‌లో టోనీ బ్లెయిర్‌కు బూట్లు, కోడిగుడ్లతో స్వాగతం!
బూట్లు విసిరించుకున్న నాయకుల జాబితాలో బ్రిటీష్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ కూడా చేరిపోయారు. తన జ్ఞాపకాలతో కూడిన పుస్తకాలపై సంతకాల కార్యక్రమం కోసం మొదటిసారిగా డబ్లిన్‌కు వచ్చిన బ్లెయిర్‌కు ఘోర పరాభవమే ఎదురైంది. యుద్ధ వ్యతిరేక ప్రదర్శకులు బ్లెయిర్‌పై బూట్లు, కోడిగుడ్లు విసిరారు. అనేక మంది బ్లెయిర్‌వి ‘రక్తపు మరకల చేతులు’ అంటూ నినాదాలు చేశారు.
అయతే.. బ్లెయిర్ మాత్రం చాలా లక్కీ నిరసన కారులు విసిరిన వస్తువుల్లో ఏ ఒక్కటి బ్లెయిర్‌ను తాకలేదు. "ఎ జర్నీ" పేరిట స్వీయ జ్ఞాపకాలతో టోనీ బ్లెయిర్ రాసుకున్న పుస్తకం ఇటీవల మార్కెట్లో విడుదలయిన విషయం తెలిసిందే. హట్ కేకుల్లా అమ్ముడవుతున్న ఈ పుస్తకాలను మరింత ఆదరణ పొందేలా చేయటానికి కొనుగోలుదారులకు తన సంతకంతో కూడిన పుస్తకాలను అమ్మడం కోసం బ్లెయిర్ డబ్లిన్‌లోని ఈసన్ బుక్‌స్టోర్‌కు వచ్చారు.
బ్లెయిర్ కారు దిగుతుండగా నిరసనకారులు బ్లెయిర్ చేతులు రక్తంతో తడిసాయంటూ గట్టిగా నినాదాలు చేస్తూ బూట్లు, కోడిగుడ్లతో స్వాగతం పలికారు. ఇరాక్, అఫ్గానిస్థాన్‌లపై జరిగిన దాడుల్లో అమెరికాతో పాటుగా బ్రిటన్ కూడా పాల్గొనడాన్ని బ్లెయిర్ తన పుస్తకంలో గట్టిగా సమర్థించుకున్నారు. కాగా.. బ్లెయిర్ రాక సందర్భంగా పోలీసులు బుక్‌స్టోర్ వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేసారు.