ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » గౌతమాలలో వరదలు: 14 మంది మృతి- ఎమర్జెన్సీ ప్రకటన! (Guatemala floods | declares emergency | President | Alvaro Colom)
మెక్సికో - సెంట్రల్ అమెరికా సరిహద్దుల్లో ఉన్న గౌతమాల దేశాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. గత కొద్ది వారాలుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మట్టి పెళ్లలు విరిగి ఓ బస్సుపై పడటంలో అందులో ప్రయాణిస్తున్న 10 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో సంఘటనలో ఓ ఇంటిపై విరిగి పడిన మట్టి పెళ్లలు నలుగురిని బలి తీసుకున్నాయి.
దీంతో గౌతమాల అధ్యక్షుడు అల్వారో కొలమ్ దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అయితే వెంటనే సహాయక చర్యలు అందించటానికి నిధులు లేవని, గతంలో అగతాలో సంభవించిన తుఫాను వంటి ప్రకృతి భీభత్సాలు సంభవించినపుడు, ఇటువంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి నిధులు మిగల్లేదని ఆయన అన్నారు.
గత కొద్ది వారాలుగా కురుస్తున్న ఈ వర్షాల కారణంగా సంభవించిన నష్టం 350 మిలియన్ డాలర్ల నుంచి 500 మిలియన్ డాలర్లకు పెరిగిందని ఆయన అన్నారు. ఇది అగతాలో సంభవించిన తుఫానుతో పోలిస్తే దాదాపు అందులో 40 శాతం ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని అన్నారు.
అగతాలో సంభవించిన తుఫానులో మొత్తం 183 మంది మరణించగా ఇందులో 165 మంది గౌతమాల పౌరుల ఉన్నట్లు ఆయనె తెలిపారు. ఈ తుఫాను కారణంగా వేలాది మంది ప్రజలు నిరాశ్రుయలైనట్లు ఆయన పేర్కొన్నారు.