ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » రష్యా మిలిటరీ క్యాంప్‌పై మానవ బాంబు దాడి!! (Russia | Injured | Suicide Attack | suicide car bombing | military camp)
ఓ వైపు కార్చిచ్చు సమస్యతో కొట్టుమిట్టాడుతున్న రష్యా ప్రభుత్వానికి మరోవైపు తీవ్రవాద సమస్య పెద్ద తలనొప్పిగా మారింది. ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో ఐదు మంది మరణించగా 39 మందికి పైగా గాయపడ్డారు. రష్యాలోని దక్షిణ కాస్కాసస్ ప్రాంతంలోని దగేస్థాన్‌లో ఉన్న సైనిక శిభిరాలను లక్ష్యంగా చేసుకొని మానవ బాంబు దాడి జరిగింది.
దగేస్థాన్‌లోని బుయినాక్సక్ నగరంలోని ఓ మిలిటరీ క్యాంప్‌ను లక్ష్యంగా చేసుకొని కారు నిండా పేలుడు పదార్ధాలు కలిగిన ఓ మానవ బాంబు మిలిటరీ క్యాంప్ వైపు వేగంగా దూసుకొచ్చి తనను తాను పేల్చుకోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. కాగా.. ప్రమాదంలో గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక టీవీ ఛానెల్ తెలిపింది.
ఈ సంఘటనపై విచారణ జరిపేందుకు ఓ ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు రక్షణ శాక ప్రతినిధి ఒకరు తెలిపారు. సరిగ్గా 11 సంవత్సరాల క్రితం సెప్టెంబర్ 1999లో కూడా రష్యాలో ఇలాంటి ప్రమాదమే సంభవించింది. ఓ లారీ నిండుగా పేలుడు పదార్ధాలతో కూడిన మానవ బాంబు బుయినాక్సక్ నగరంలోని ఓ నివాస భవంతిని పేల్చి వేసింది. ఈ సంఘటనలో దాదాపు 64 మంది మృతి చెందారు.