దేశ భవిష్యత్తును ఎన్నికలే నిర్ణయిస్తాయి: హ్యూగో ఛావెజ్
వెనిజులా పార్లమెంటుకు జరగనున్న ఎన్నికలు నిర్ణయాత్మకమైనవని ఆ దేశ అధ్యక్షుడు హ్యూగో ఛావెజ్ ఉన్నారు. ఈ నెల 26 నుంచి జరిగే పార్లమెంటు ఎన్నికల కోసం ఇప్పటికే పార్టీలు తమ ప్రచారాలను ముమ్మరం చేశాయి. ఈ ఎన్నికల క్రూసేడ్‌లో భాగంగా వెనిజులా సోషలిస్టులు భారీ ఎత్తున ప్రచారాలు సాగిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎన్నికల్లో ఘన విఝయం సాధించాలని సోషలిస్టులు కృత నిశ్చయంతో ఉన్నారు.
గత దశాబ్ద కాలం క్రితం ప్రారంభించిన ఆర్థిక, సామాజిక మార్పుల కొనసాగింపు ఈ ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉన్నట్లు ఛావెజ్ జూలియా రాష్ట్రంలో జరిగన ఓ బహిరంగ సభలో వేలాది మంది ప్రజలను ఉద్దేశిస్తూ ప్రసంగించారు. ఈ పోటీ సులభమైంది కాదని, ప్రతిపక్షాన్ని తక్కువగా అంచనా వేయలేమని ఆయన అన్నారు. సామాజికంగా ప్రయోజనకరమైన చట్టాల పునరుద్ధరణను ఈ ఎన్నికల ఫలితాలే నిర్ణయిస్తాయని పిఎస్‌యువి, ప్రతిపక్షం రెండూ భావిస్తున్నాయి.
పార్లమెంటులో ఎలాంటి అడ్డకులు లేకుండా చట్టాలు చేసేందుకు మూడింట రెండు వంతుల మెజారిటీని సాధించేందుకు తీవ్రంగా కృషి చేయాల్సిందిగా పిఎస్‌యువి (సోషలిస్టులు) నాయకత్వం తమ శ్రేణులకు పిలుపునిస్తోంది. కాగా ఈ దేశ భవిష్యత్తు సెప్టెంబర్ 26న జరిగే ఎన్నికల ద్వారా నిర్ణయమౌతుందని చావెజ్ అన్నారు.