జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » ఒబామా ప్రకటన అసాధ్యం: సైనిక నిపుణుల అభిప్రాయం! (Obama | America | Militry | Iraq | International)
Bookmark and Share Feedback Print
 
ఇరాక్‌లో 2011 నాటికి పూర్తిగా తమ బలగాలను ఉపసంహరిస్తామని అగ్రరాజ్యం అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన ప్రకటనపై సైనిక నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధ్యక్షుడు ప్రకటన రూపంలో చేసినట్టుగా ఆచరణ సాధ్యం కాదని మెజార్టీ నిపుణులు చెపుతున్నారు. 2011 తర్వాత కూడా తన దళాలను ఇరాక్‌లో ఉంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సైనిక నిపుణులు, మాజీ సైనికాధికారులు చెపుతున్నారు.

2011 చివరి నాటికి అమెరికా సైనికుల్నందర్నీ ఉపసంహరించాలని భద్రతా ఒప్పందం ఉన్నప్పటికీ ఇరాక్‌లో అమెరికా ఉనికి ఆ తర్వాత కూడా ఉంటుందని అమెరికా అధికారులు అనధికారికంగా చెపుతున్నారు.అమెరికా సైనికులను శాంతి పరిరక్షక దళాలుగా రిజర్వులో ఉంచుకోవాలని పలువురు ఇరాక్‌ రాజకీయవేత్తలు భావిస్తుండటమే ఇందుకు ప్రధాన కారణమన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాక్‌ సైన్యానికి సైనికపరమైన మద్దతుతో పాటు వైమానిక శక్తి, ఆయుధాలు, నైపుణ్యం, శిక్షణపై అమెరికా సైనికుల మద్దతు ఎంతో అవసరమన్నారు. ప్రస్తుతం ఇరాక్‌ సైనికులకు శిక్షణ, సహాయాన్ని అందించేందుకు సుమారు 50 వేల మంది సైనికులున్నారు. తమ దేశ దళాలకు కనీసం మరో దశాబ్దం పాటు అమెరికా సహాయం అవసరమని ఇరాక్‌ సైనికాధిపతి జనరల్‌ బాబాకర్‌ జెబారీ గత నెలలో చెప్పిన విషయం తెల్సిందే.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.