ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » కాంగోలో నదిలో బోల్తా పడిన పడవలు: 70 మంది మృతి! (Congo | Missing | Boat capsizes | Kinshasa | People dead | International)
కాంగోలో రెండు పడవలు నదిలో ప్రమాదవశాత్తు బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో 70 మంది మృతి చెందగా, మరో 200 మంది గల్లంతైనట్టు స్థానిక అధికారులు వెల్లడించారు. వాయువ్య ఈక్వెటీర్ ప్రొవీన్స్ ప్రాంతంలోని ఓ నదిలో కొంతమంది ప్రయాణికులతో పడవలో వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుందని ప్రొవీన్స్ ప్రతినిధి ఎబాలె ఎగుంబా తెలిపారు. ఈ ప్రమాదంలో కనీసం 70 మంది మృతిచెంది ఉంటారని భావిస్తున్నామని, మరో 70 మంది ఆచూకీ తెలియరాలేదని తెలిపారు.
చీకటి ప్రాంతంలో పడవ ప్రయాణం ఎందుకు కొనసాగించారనే అంశంపై అధికారులు దర్యాప్తు సాగిస్తున్నట్టు చెప్పారు. అలాగే, ప్రమాదం జరిగిన పడవలో ఎలాంటి కాగా, కసాయ్ ఆక్సిడెంటల్ ప్రొవీన్స్‌లో మరో పడవ ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో కనీసం 200 మంది వరకు మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు.
దక్షిణ కాంగోలో ఇంధన డ్రమ్ములు, ప్రయాణికులతో వెళుతున్న పడవలో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు ప్రమాదం నుంచి బయటపడిన ఒక వ్యక్తి చెప్పారు. దీనిపై స్థానిక అధికార యంత్రాంగం అధికారికంగా స్పందించలేదు.