ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » అణు కార్యక్రమాన్ని ఆపే ప్రసక్తే లేదు: ఇరాన్ స్పష్టీకరణ! (Nuclear process | Iran | Urenium | UN Security council | America)
అణు కార్యక్రమాన్ని ఆపే ప్రసక్తే లేదు: ఇరాన్ స్పష్టీకరణ!
స్వప్రయోజనాల కోసం చేపట్టిన అణు కార్యక్రమాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపే ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. ప్రపంచ దేశాల విజ్ఞప్తిని తోసిరాజని యధావిధిగా ఇరాన్ అణు కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. దీనిపై అగ్రరాజ్య అమెరికాతో పాటు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో... ఇరాన్‌పై నిషేధం విధించాలని ఐరాస భద్రతామండలిలో పలు సభ్య దేశాలు తీర్మానించాయి.
ఇందులోభాగంగా, గత నెల తొమ్మిదో తేదీన ఐరాస భద్రతా మండలి నాలుగో దఫాగా పలు ఆర్థిక ఆంక్షలను విధించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రమీన్ మెహ్‌మాన్‌పర్షాద్ ఆ దేశ జాతీయ మీడియాతో మాట్లాడుతూ తమ దేశ అణు కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విరమించుకునే ప్రసక్తే లేదు.
కేవలం స్వదేశీ అవసరాల్లో భాగంగా విద్యుత్ ఉత్పత్తి కోసమే అణు పరిశోధన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్టు చెప్పారు. ఇస్లాం రిపబ్లిక్ దేశమైన ఇరాన్‌పై ఆర్థికంతో పాటు వివిధ రకాల ఆంక్షలు విధిస్తూ ఐరాస భద్రతా మండలిలో తీర్మానం చేయడంలో తమకెలాంటి భయం లేదన్నారు. ఎన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురైనా తాము చేపట్టిన యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ఆయన తేల్చి చెప్పారు.