జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » ఆస్ట్రేలియాలో కొత్త ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన! (Australia | New govt | Labour | Liberal parties | International | Julia gillard)
Bookmark and Share Feedback Print
 
ఆస్ట్రేలియాలో ఎన్నికల ఫలితాల అనంతరం కొత్త ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన నెలకొంది. ప్రధాన రాజకీయ పక్షాలైన లేబర్, లిబరల్ పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలాన్ని సాధించలేక పోయాయి. దీంతో ఎన్నికల ఫలితాలు వెలువడి రెండు వారాలు గడుస్తున్నా ప్రభుత్వ ఏర్పాటులో ఏర్పడిన ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది.

ఆస్ట్రేలియా పార్లమెంట్‌కు గత నెల 21వ తేదీన ఎన్నికలు జరిగాయి. మొత్తం 150 మంది సభ్యులు కలిగిన పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రధాని జూలియా గిల్లార్డ్‌కు 74 సీట్లు లభించాయి. అంటే ఆమె ప్రత్యర్థి టోనీ అబోట్‌ నేతృత్వంలోని లిబరల్ పార్టీకి ఒక్క స్థానం అధికంగా 75 సీట్లతో ఉంది. కానీ, ప్రభుత్వ ఏర్పాటుకు మరో రెండు స్థానాలు కావాల్సి ఉంది.

ఈ పరిస్థితుల్లో చిన్నచితకా పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కీలకంగా మారారు. వీరి ఎవరికి మద్దతు ఇస్తారనే అంశంపై సందిగ్ధత కొనసాగుతోంది. అయితే, ముగ్గురు ఇండిపెండెట్ల గ్రూపు సూత్రధారిగా ఉన్న టోనీ విండ్సర్‌ స్పందిస్తూ మేమంతా ఒకే రకంగా ఓటు వేస్తామన్నారు.

అయితే, ఎవరికి ఓటు వేస్తామనే విషయాన్ని బహిరంగంగా వ్యక్తపరచలేమన్నారు. అందువల్ల ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన కొనసాగుతోంది. కాగా, ఆస్ట్రేలియాలో ఏడు దశాబ్దాల తర్వాత తొలిసారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైన విషయం తెల్సిందే.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.