ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » పాక్‌కు మరో 200 మిలియన్ యువాన్ల సాయం: చైనా (China, Aid | Pakistan | Jiang Yu | Additional Aid | Flood Victims | Floods)
పాక్ వరదల్లో నిరాశ్రయులైన లక్షలాది ప్రజలను అందుకునేందుకు చైనా మరింత వరద సహాయన్ని ప్రకటించింది. తమ పొరగు దేశమైన పాక్‌కు అదనంగా మరో 200 మిలియన్ యువాన్ల(29.4 మిలియన్ అమెరికా డాలర్ల)ను అందిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. అంతకు ముందు 120 మిలియన్ యువాన్లను వరద సహాయంగా ప్రకటించింది.
"చైనా ప్రభుత్వం పాక్‌కు ఇది వరకు ప్రకటించిన వరద సహాయానికి అదనంగా మరో 200 మిలియన్ యువాన్లను వరద సహాయంగా ప్రకటించింది" అని విదేశీ వ్యవహారాల ప్రతినిధి జియాంగ్ యూ తెలిపారు. పాకిస్థాన్ చాలా దగ్గరి పొరుగు దేశం, మంచి స్నేహితం దేశం, బాధితులను అందుకోవడంలో పాకిస్థాన్‌కు చైనా అన్ని విధాల సహాయాన్ని అందిస్తుందని జియాంగ్ అన్నారు.
కాగా.. పాకిస్థాన్‌లో ఇటీవల సంభవించిన వరదల కారణంగా 1750 మంది మృత్యువాత పడినట్టు ఆ దేశ ప్రధానమంత్రి యూసుఫ్ రజా గిలానీ వెల్లడించారు. దేశంలోని 124 జిల్లాల్లో 79 జిల్లాల్లో అపారనష్టం వాటిల్లిందని చెప్పారు. ఈ వరదల వల్ల 1.30 మిలియన్ ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టు ఆయన తెలిపారు.