ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » 20 మంది ఉరిశిక్ష దోషులకు బంగ్లాదేశ్ ప్రాణదానం! (Bangladesh | Pardons | Death row convicts | Dhaka | BNP | Zillur Rahman)
బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ కీలక నేత హత్య కేసులో ఉరిశిక్ష పడిన 20 మందికి ఆ దేశ అధ్యక్షుడు క్షమాభిక్ష ప్రసాదించారు. ఫలితంగా దోషుల్లో 14 మంది వివిధ జైళ్ళ నుంచి విడుదలయ్యారు. మరో ఆరుగురు దోషులపై మాత్రం మరికొన్ని కేసులు ఉండటం వల్ల వారు శిక్షను అనుభవిస్తున్నారు.
బీఎన్పీ పార్టీకి చెందిన కీలక నేత ఒకరు 2004లో దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసులో 20 మందిని అరెస్టు చేయగా, వీరికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు 2005లో మరణశిక్షను విధించారు. దీంతో వీరు క్షమాభిక్ష ప్రసాదించాలని కోరుతూ వారు దేశాధ్యక్షుడు జిల్లుర్ రెహ్మాన్‌కు వినతిపత్రాలు సమర్పించుకున్నారు. వీటిని పరిశీలించిన దేశాధ్యక్షుడు క్షమాభిక్ష ప్రసాదిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
దీంతో ఢాకా సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నట్టు 10 మంది ఖైదీలను సోమవారం రాత్రి విడుదల చేశారు. అలాగే, మరో నలుగురు ఖైదీలను వాయువ్య రాజ్‌షాహి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. మిగిలిన ఆరుగురు దోషులను మాత్రం జైలు అధికారులు విడుదల చేయలేదు. వీరిపై మరికొన్ని కేసుల విచారణ సాగుతున్నందున వీరి విడుదలకు బెయిల్ అవసరమని అధికారులు చెపుతున్నారు.