ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » మెక్సికోలో 400 స్వలింగ సంపర్క వివాహాలు నమోదు! (Gay marriages, Registered, Mexico, Foreigners, Europeans)
మెక్సికో ప్రజలు వికృత చేష్టలు మరింత జుగుస్సాకరంగా మారాయి. ఆ దేశంలో స్వలింగ సంపర్క (గే సెక్స్) వివాహాలకు అనుమతి ఇస్తూ చట్ట సవరణ చేశారు. దీంతో స్వలింగ జాతికి చెందిన వారు ఆగడాలు మరింత పెరిగిపోయాయి. గత ఆరు నెలల్లో 400 జంటలు వివాహం చేసుకున్నట్టు ఆ దేశ అధికారులు సోమవారం వెల్లడించారు.
ఇప్పటి వరకు మొత్తం 398 వివాహాలు రిజిస్టర్ కాగా, వీటిలో 53 శాతం వివాహాలు పురుషుల మధ్య, 47 శాతం వివాహాలు మహిళలు మధ్య జరిగినట్టు మెక్సికో సిటీ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఆరునెలల కాలంలో 41 మంది విదేశీయులు కూడా చేరారు. వీరిలో ఎక్కువగా యూరోపియన్స్ దేశస్తులు ఉండగా, తర్వాతి స్థానాల్లో దక్షిణాఫ్రికా, ఉత్తర అమెరికా వాసులు ఉన్నారు.
గే వివాహాలు చేసుకున్న వారిలో ఎక్కువగా 30 నుంచి 40 వయస్సు వారు ఉన్నారు. అలాగే, 71 నుంచి 90 మధ్య వయస్సు కలిగిన వివాహా జంటలు నాలుగు ఉండటం గమనార్హం. ఇటీవల మెక్సికో సుప్రీంకోర్టు గే సెక్స్ వివాహాలకు అనుమతి ఇచ్చిన విషయం తెల్సింది.