ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » శాంతి కోసం భారత్‌తో కలిసి పని చేసేందుకు చైనా సిద్ధం! (China | Work | India | Peace | South Asia | Beijing | South Asia)
శాంతి కోసం భారత్‌తో కలిసి పని చేసేందుకు చైనా సిద్ధం!
దక్షిణాసియాలో శాంతి స్థాపన కోసం భారత్‌తో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చైనా ప్రకటించింది. దక్షిణాసియాలో తాము కీలక దేశమని, అందువల్ల ఈ ఉపఖండంలో శాంతిస్థాపన కోసం భారత్‌తో కలిసి ముందుకు సాగేందుకు కోరుకుంటున్నట్టు చెప్పారు.
చైనాతో కాస్త అప్రమత్తంగానే ఉండాలని ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జియాంగ్ యూ స్పందిస్తూ ఆసియాలో శాంతి, స్థిరత్వం కోసం అవసరమైన రక్షణ చర్యలకు కట్టుబడి ఉన్నట్టు తెలిపారు.
ఆసియాలో చైనా ఒక కీలక దేశమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాల కోసం తాము కట్టుబడి ఉన్నామన్నారు. అయితే, మిగిలిన దేశాలు సాధారణ అభివృద్ధిని కాంక్షిస్తుండగా, తాము మాత్రం అందరి బాగోగుల కోసం పని చేస్తున్నట్టు చెప్పారు.