ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » న్యూ సౌత్‌వేల్స్ యూనివర్శిటీలో గాంధీ విగ్రహ ప్రతిష్టాపన! (Gandhi statue| Stands | New South Wales University | Melbourne)
న్యూ సౌత్‌వేల్స్ యూనివర్శిటీలో గాంధీ విగ్రహ ప్రతిష్టాపన!
ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌వేల్స్ విశ్వవిద్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించారు. యూనివర్శిటీ ప్రాంగణంలోని గ్రంథాలయం సమీపంలో ఉన్న పార్కులో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇది భారత్, ఆస్ట్రేలియా దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి మరింతగా దోహదపడుతుందని యూనివర్శిటీ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
కాగా, ఈ విగ్రహాన్ని భారత ప్రభుత్వం విశ్వవిద్యాలయానికి బహుకరించింది. దీనితో పాటు.. కొన్ని అరుదైన పుస్తకాలను కూడా అందజేసినట్టు వర్శిటీ అధికారులు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. సిడ్నీకి చెందిన భారత దౌత్యవేత్త అమిత్ దాస్‌గుప్తాని గత యేడాది అక్టోబరులో అందజేశారు. ఆ సమయంలో ఆసీస్‌లోని పలు ప్రాంతాల్లో భారతీయ విద్యార్థులు, పౌరులపై దాడులు ముమ్మరంగా సాగుతున్నాయి.
అయినప్పటికీ.. భారత్‌తో మరింత సన్నిహిత సంబంధాలు కలిగి ఉండాలని, భారతీయ విద్యార్థులకు సుహృద్భావ వాతావరణం కల్పించాలనే ఏకైక ఉద్దేశ్యంతో వర్శిటీ అధికారులు మరింత చొరవ తీసుకుని ఈ విగ్రహ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా దాస్‌గుప్తా స్పందిస్తూ.. హింసకు అడ్డుకట్ట వేయడంలో విద్య, గ్లోబలైజేషన్‌లు అత్యంత కీలకమని పేర్కొన్నారు.