జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » రూ.5 వేల కోట్లతో ఆర్థిక ప్యాకేజీని వెల్లడించిన ఒబామా! (Financial package | Obama | Employment | Whitehouse | International)
Bookmark and Share Feedback Print
 
అమెరికా ఆర్థిక రంగాన్ని, నిరుద్యోగులను ఆదుకునే దిశగా చర్యలు చేపట్టారు. ప్రధానంగా నిరుద్యోగస్తులకు ఉపాధి భరోసా ఇచ్చేలా ఆయన ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించించారు. దీని విలువ రూ.5 వేల కోట్ల డాలర్లుగా ఉంది. ఈ నిధులతో వచ్చే ఆరేళ్ళ కాలంలో మౌలిక సదుపాయాల పునరుద్ధరణ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ఆయన ప్రకటించారు. ఈ పథకాన్ని తాజాగా ఒబామా ప్రకటించారు.

ఈ పథకంలో భాగంగా ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బ్యాంకును నెలకొల్పనున్నారు. సోమవారం కార్మిక దినోత్సవం సందర్భంగా మిల్‌వాకీలో జరిగే కార్మిక ర్యాలీలో ప్రసంగించడం ద్వారా ఎన్నికల ప్రచారానికి ఒబామా శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా ఈ ఆర్థిక ప్యాకేజీని ఆయన ప్రకటించారు. దేశంలో నిరుద్యోగ రేటు 9.7 శాతానికి చేరుకున్న నేపధ్యంలో నవంబర్ రెండున జరిగే కాంగ్రెస్ ఎన్నికల్లో డెమోక్రాట్లకు ఎదురుగాలి వీస్తుందన్న అంచనాల మధ్య ఒబామా పాలన యంత్రాంగం ఓటర్లను సంతృప్తిపరిచేలా ఈ చర్య చేపట్టారు.

గడచిన ఏడు దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత తీవ్రమైన ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో తాము ప్రవేశపెడుతున్న పథకాలు ఆర్థకరంగాన్ని గట్టెక్కిస్తాయనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ నిధులతో భవనాలు, రోడ్లు, రైల్వేలు, రన్‌వేల పునరుద్ధరణ తదితర చర్యలు చేపడతామని, వీటివల్ల లక్షలాది ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.