జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » పాకిస్థాన్‌లో కోటి మంది ఆవాసాలను కోల్పోయారు: ఐరాస (UN says | Ten Million | Without Shelter | Pak floods | United Nations)
Bookmark and Share Feedback Print
 
ఇటీవల పాకిస్థాన్‌లో సంభవించిన వరదల కారణంగా 10 మిలియన్ల మంది ప్రజలు ఆవాసం లేక అల్లాడుతున్నారని ఐక్య రాజ్య సమితి తెలిపింది. నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు సహాయ చర్యలను పర్యవేక్షించేందుకు వెళ్లిన అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు.

తాజా అంచనాల ప్రకారం గత కొద్ది రోజుల క్రితం సింథ్‌లో సంభవించిన వరదల కారణంగా దాదాపు 10 మిలియన్ల మంది ప్రజలు ప్రస్తుతం నివాసం లేకుండా ఉన్నారని ఐరాస ప్రతినిధి మారిజో గిలియానో తెలిపారు. ఐక్య రాజ్య సమితి చరిత్రలో సంభవించిన అతి దరదృష్టకరమైన ప్రకృతి భీభత్సాలలో పాకిస్థాన్ కూడా ఒకటని ఆయన పేర్కొన్నారు.

ఇక్కడి వరద సహాయక చర్యలను సమీక్షించేందుకు వాలెరీ ఎమోస్‌తో కలిసి గిలియానో బుధవారం పాకిస్థాన్ చేరుకున్నారు. అనంతరం పాక్‌లోని కొన్ని వరద పీడిత ప్రాంతాలను సందర్శించిన గిలియానో ఈ అంచనాకు వచ్చారు. ఈ సందర్భంగా ఎమోస్ మాట్లాడుతూ.. పాకిస్థాన్‌లో సంభవించిన ఈ వరదలు దాదాపు 21 మిలియన్ల ప్రజలపై ప్రభావం చూపాయని, ప్రపంచంలో సంభవించిన అతిపెద్ద ప్రకృతి భీభత్సాలలో ఇది కూడా ఒకటని ఆమె చెప్పారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.