ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » భారత అణు పరిహార బిల్లుపై దృష్టి సారించిన అమెరికా (Nuclear Liability Bill | Indian Government | Parliament | America | US)
ఇటీవల పార్లమెంటులో ఆమోదం పొందిన "అణు పరిహార బిల్లు"లోని కొన్ని కీలక ప్రాంతాలలో ఎటువంటి అంశాలను మార్పు చేయాలనే అంశంపై అమెరికా భారత్‌పై దృష్టి సారించింది. "ఈ అంశంపై భారత ప్రభుత్వం చర్చలు కొనసాగిస్తున్నాం, ఇటీవల పార్లమెంటు ఆమోందించిన అనంతరం ఈ బిల్లు చట్టం గురించి కొందరు భారత వ్యాపార వేత్తల సలహాలను పరిశీలిస్తున్నాం" అని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి పి.జె. క్రౌలీ తెలిపారు.
"ఇందులో ఎటువంటి మార్పులు చేయాలనే అంశాన్ని మేము పరిశీలిస్తున్నాం, ఇందుకు గానూ భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతాం" అని ఆయన అన్నారు. గత నెల 30వ తేదీన పార్లమెంటులో ప్రవేశపెట్టిన అణు పరిహార బిల్లుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. అణు ప్రమాదాలు సంభవించినపుడు బాధితులకు ఇచ్చే పరిహారం గురించి ఈ బిల్లును రూపొందించారు. ఈ బిల్లుపై ఇంకా అమెరికా అధ్యయనం చేస్తుంది.