ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » అంతర్జాతీయ » నేపాల్ మిషన్‌ను రద్దు చేస్తాం: బాన్ కీ మూన్ హెచ్చరిక (Nepal | UNO | Political | International | Ban ki Moon)
నేపాల్ మిషన్‌ను రద్దు చేస్తాం: బాన్ కీ మూన్ హెచ్చరిక
నేపాల్‌లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సంక్షోభానికి రాజకీయ పార్టీలు తెరదించకపోతే నేపాల్‌లో ఐక్యరాజ్య సమితి తన రాజకీయ దౌత్యాన్ని విరమించుకుంటుందని ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్ కి-మూన్ హెచ్చరించారు.
నేపాల్‌లో సెప్టెంబర్ 15 తర్వాత కూడా ఐక్యరాజ్యసమితి మిషన్‌ను కొనసాగించే విషయాన్ని పరిశీలిస్తున్న భద్రతా మండలికి ఇచ్చిన తాజా నివేదికలో బాన్ కి- మూన్ ఈ హెచ్చరిక చేశారు. నేపాల్‌లో రాజకీయ భవితవ్యాన్ని నిర్ణయించడంలో ఐక్యరాజ్య సమితి తన దౌత్యాన్ని విరమించుకోవడంతో సహా ఇతర ప్రత్యామ్నాయ చర్యలను భద్రతా మండలికి తాను ప్రతిపాదించనున్నట్లు బాన్ కి- మూన్ భద్రతా మండలికి సమర్పించిన ఒక నివేదికలో పేర్కొన్నారు.
నేపాల్‌లోని రాజకీయ పార్టీలు ఒకదానిపై మరొకటి విమర్శనాస్త్రాలు సంధించుకోవడం, ఒక పార్టీ పొడ మరోదానికి గిట్టక పోవడంతో సుదీర్ఘంగా రాజ్యాంగ ప్రక్రియకు విఘాతం ఏర్పడుతోందని ఐరాస ప్రధాన కార్యదర్శి కార్యాలయానికి చెందిన సీనియర్ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.