అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే భారత్ ఇంకా ఎంతగానో అభివృద్ధి చెందాల్సి ఉందని, ప్రస్తుతం భారత్ మిగతా దేశాలతో పోలిస్తే ఇంకా వెనుకబడి ఉందని ఐక్య రాజ్య సమితి తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రాథమిక విద్య, సురక్షిత తాగునీటి సరఫరా వంటి కొన్ని అంశాలలో తప్ప ఇతర సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల సాధనలో భారత్ బాగా వెనుకంజలో వుందని ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (యుఎన్‌డిపి) తన తాజా నివేదికలో వెల్లడించింది.
పేదల అనుకూల విధానాలు లేకపోవటం, కార్యక్రమాల అమలుపై కొరవడి జవాబుదారీ తనం, ప్రభుత్వ సేవల్లో చోటు చేసుకుంటున్న అసమర్ధత, సమాజంలో కొనసాగుతున్న అసమానతలు, ఈ లక్ష్యసాధనకు ప్రధాన విఘాతాలుగా మారాయని యుఎన్‌డిపి తన నివేదికలో పేర్కొంది. ఇటు వంటి సమస్యలను పరిష్కరించుకోవడం ద్వారా 2012నాటికి సగానికి తగ్గించుకోవచ్చని యుఎన్‌డిపి సూచించింది.
ముఖ్యంగా ఛత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒరిస్సా, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు కూడా ఈ లక్ష్యాలను నిర్లక్ష్యం చేస్తున్నాయని యుఎన్‌డిపి విమర్శలు గుప్పించింది. ప్రస్తుతం భారతదేశంలో 67శాతం ఉన్న పేద ప్రజల సంఖ్య 2015 నాటికి 71శాతానికి పెరుగుతుందని ఈ నివేదిక తెలిపింది. నిధులను క్రమబద్దీకరణ చేయం, ఐటీను అందుబాటులోకి తేవడం, లీకేజీలను అడ్డుకోవడం వంటివి చేస్తే త్వరితగితన మంచి ఫలితాలను పొందవచ్చని యుఎన్‌డిపి సూచించింది.